Corona: 25 రోజులుగా రికవరీలే ఎక్కువ
close

తాజా వార్తలు

Updated : 07/06/2021 15:04 IST

Corona: 25 రోజులుగా రికవరీలే ఎక్కువ

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు లక్షకు దిగిరాగా, 2,427 మరణాలు సంభవించాయి. గత 25 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే క్రియాశీల కేసుల సంఖ్య 14లక్షలని పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలకు సడలింపులు ప్రకటిస్తున్నాయి. 

5 రాష్ట్రాల్లో 68.4శాతం కొత్త కేసులు..నిన్న నమోదైన కరోనా కొత్త కేసుల్లో ఐదు రాష్ట్రాల వాటానే 68.4 శాతంగా ఉంది. తమిళనాడులో అత్యధికంగా 20,421 కేసులు వెలుగుచూడగా, కేరళలో 14,672, మహారాష్ట్రలో 12,557, కర్ణాటకలో 12,209, ఆంధ్రప్రదేశ్‌లో 8,976 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.89కోట్ల మందికి పైగా కరోనా సోకింది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 14 రోజులుగా 10శాతానికి దిగువనే ఉండటం ఊరటనిచ్చే విషయం. 

25 రోజులుగా రికవరీలే ఎక్కువ..24 గంటల వ్యవధిలో 1,74,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.71కోట్లను దాటాయి. గత 25రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రికవరీ రేటు 93.94 శాతంగా ఉంది. 

వరుసగా 7రోజులు..20లక్షలకు దిగువనే..దేశంలో క్రియాశీల కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం అవి 14లక్షలకు చేరాయి. వరుసగా ఏడురోజులుగా క్రియాశీల కేసుల సంఖ్య 20లక్షల దిగువనే ఉంటోంది. వైరస్ ఉద్ధృతి తగ్గుతుండటంతో కొవిడ్‌తో చికిత్స పొందేవారి సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. 

రాష్ట్రాలకు 24.6 కోట్ల డోసుల పంపిణీ..రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ప్రభుత్వం ఇప్పటివరకు 24.6కోట్ల టీకా డోసులను పంపిణీ చేసింది. ప్రస్తుతం వాటి వద్ద 1.49కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉండగా, నిన్న 13.9లక్షల మందికి టీకా ఇవ్వగా, ఇప్పటివరకు వేసిన టీకాల సంఖ్య 23కోట్లను మించింది. 


 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని