మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞత ఉంది : రాష్ట్రపతి

తాజా వార్తలు

Published : 01/04/2021 16:43 IST

మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞత ఉంది : రాష్ట్రపతి

దిల్లీ: బైపాస్‌ సర్జరీ తర్వాత తాను బాగానే కోలుకుంటున్నానని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికి మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతభావం ఉందని భావోద్వేగంగా స్పందించారు. ఆస్పత్రిలో సేవలందించిన వైద్యులు, సంరక్షకుల అంకితభావానికి ధన్యవాదాలు తెలిపారు.  

కాగా, ఛాతీలో అసౌకర్యం కారణంగా గత నెల 26న ఆయన ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ సాధారణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం దిల్లీ ఎయిమ్స్‌కు సిఫార్సు చేశారు. అనంతరం మంగళవారం దిల్లీ ఎయిమ్స్‌లో రామ్‌నాథ్‌కు బైపాస్‌ సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని దేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఆకాంక్షించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని