close

తాజా వార్తలు

Published : 23/02/2021 23:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దీప్‌ సిద్ధూ కస్టడీని పొడిగించిన దిల్లీ కోర్టు

దిల్లీ: పంజాబీ నటుడు, సామాజిక కార్యకర్త దీప్‌ సిద్ధూ పోలీస్‌ కస్టడీని మరో రెండు వారాలపాటు పొడిగిస్తూ దిల్లీ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దీప్‌ సిద్ధూ కీలకపాత్రధారి అని దిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలున్నాయని వారు గతంలో కోర్టుకు తెలిపారు. ఫిబ్రవరి 2న అరెస్టైన దీప్ సిద్ధూ అప్పటి నుంచి పోలీసు కస్టడీలోనే ఉన్నారు.  నేటితో ఆయన కస్టడీ పూర్తవుతుండటంతో పోలీసులు ఆయన్ను మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సమర్‌జీత్‌ కౌర్‌ ముందు హాజరుపర్చారు.

 రైతులు దిల్లీలో చేపట్టిన ట్రాక్టర్‌ పరేడ్‌ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో దీప్‌ సిద్ధూ పాత్ర ఉందని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 26 తర్వాత దీప్‌ సిద్ధూ అజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతరం ఫిబ్రవరి 2న చండీగఢ్‌, అంబాలా మధ్యనున్న జిరాక్‌పుర్‌ ప్రాంతంలో దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ఆయన్ను అరెస్టు చేసింది. రైతుల ర్యాలీ ఎర్రకోట వైపు వెళ్లేలా ప్రేరేపించినట్లు ఆయనపై అభియోగం నమోదైంది. ఎర్రకోట వద్ద ఉద్రిక్త ఘటనలు నెలకొన్న సమయంలో ఆయన అక్కడే ఉన్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు.


ఇవీ చదవండి


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని