Reliance foundation: రిలయన్స్‌ ఫౌండేషన్‌ దాతృత్వం.. ఏం చేసిందంటే?

తాజా వార్తలు

Published : 13/08/2021 01:37 IST

Reliance foundation: రిలయన్స్‌ ఫౌండేషన్‌ దాతృత్వం.. ఏం చేసిందంటే?

తిరువనంతపురం: కరోనా కష్టకాలంలో రిలయన్స్ ఫౌండేషన్‌ ఆయా ప్రభుత్వాలకు తనవంతు సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేరళకు అండగా నిలిచింది. కొవిడ్‌ కేసులతో సతమతమవుతున్న ఆ రాష్ట్రానికి గురువారం 2.5 లక్షల కొవిషీల్డ్‌ డోసులు ఉచితంగా అందజేసింది. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందిస్తూ.. ‘రిలయన్స్‌ ఫౌండేషన్‌ సహకారం మా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మరింత ముమ్మరం చేస్తుంది. సంస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు. ‘మహమ్మారి కట్టడి విషయంలో దేశానికి వెన్నంటే ఉన్నాం.  వైరస్‌ నియంత్రణ విషయంలో మాస్ వ్యాక్సినేషన్‌ విధానం ఎంతో ప్రభావవంతమైంది. మిషన్‌ వ్యాక్సిన్‌ సురక్షలో భాగంగా దేశవ్యాప్తంగా ఉచితంగా టీకా పంపిణీ చేపడుతున్నాం. ఈ క్రమంలో కేరళవాసులకు తోడుగా నిలిచామ’ని ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ పేర్కొన్నారు. గతంలో కేరళలో భారీ వరదలు సంభవించినప్పుడు కూడా ఈ ఫౌండేషన్‌ ద్వారా సీఎం సహాయనిధికి రూ.21 కోట్లు ఇచ్చింది. వరద సహాయక చర్యలు చేపట్టడంతోపాటు మందులు, నిత్యావసరాలు సరఫరా చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని