యడియూరప్పకు సుప్రీంలో ఊరట!

తాజా వార్తలు

Updated : 05/04/2021 18:47 IST

యడియూరప్పకు సుప్రీంలో ఊరట!

దిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పదేళ్ల నాటి ఓ కేసులో ఆయనపై దర్యాప్తు చేయాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై భారత అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. 2008-12మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న యడియూరప్ప, ప్రభుత్వానికి చెందిన 20 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

యడియూరప్పపై వచ్చిన అవినీతి ఆరోపణలపై 2012లో కర్ణాటక లోకాయుక్తలో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో యడియూరప్ప అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు లోకాయుక్త ఛార్జిషీట్‌లో ఆరోపించింది. అప్పట్లోనే దీనిపై విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు, సరైన సాక్ష్యాధారాలు లేవని తొమ్మిది మందిపై కేసును విరమించుకున్నారు. కానీ యడియూరప్పతో పాటు మరో మాజీ మంత్రిపై మాత్రం చార్జిషీట్‌ దాఖలు చేశారు.

గతంలో యడియూరప్పపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని ఓ వ్యాపారవేత్త కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో అప్పట్లో లోకాయుక్త నమోదు చేసిన కేసు ఆధారంగా ఆయనపై విచారణ చేపట్టాలని కర్ణాటక హైకోర్టు మార్చి 21న ప్రత్యేక కోర్టును ఆదేశించింది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని