EAM: తాలిబన్‌ నేతలతో సమావేశం అవాస్తవం!

తాజా వార్తలు

Updated : 29/06/2021 22:28 IST

EAM: తాలిబన్‌ నేతలతో సమావేశం అవాస్తవం!

దిల్లీ: కొంతమంది తాలిబన్‌ నేతలతో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సమావేశమయ్యారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవిగా అధికార వర్గాలు తేల్చి చెప్పాయి. భవిష్యత్తులో భారతదేశంతో తాలిబన్ల సంబంధాలు పాకిస్తాన్ అభిప్రాయాలు, కోరికల మీద ఆధారపడి ఉండవంటూ ఆ సంస్థ నేతలు మంత్రికి చెప్పినట్టుగా సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. వాటిని నమ్మొద్దంటూ మంగళవారం స్పష్టం చేశాయి. ‘రానున్న సెప్టెంబర్ 11 నాటికి అఫ్గానిస్థాన్ నుంచి తమ బలగాలను వెనక్కి రప్పించాలని అమెరికా భావిస్తోంది. దీంతో అఫ్గాన్‌ శాంతి ప్రక్రియకు సంబంధించిన పరిణామాలు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో తాలిబన్లు జట్టు కట్టడం అఫ్గానిస్థాన్‌ భవిష్యత్తుకు అన్నివిధాలా ప్రయోజనకరమంటూ ఇటీవల ఓ వెబినార్‌లో ఖతర్‌కు చెందిన సీనియర్‌ దౌత్యవేత్త అభిప్రాయపడ్డారు. దీంతో ఇలాంటి తప్పుడు నివేదికలు వెలువడటానికి అవకాశం ఏర్పడింది’ అని అధికారిక వర్గాలు వివరించాయి.   

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని