లోక్‌సభలో వాయిదాల పర్వం
close

తాజా వార్తలు

Published : 03/02/2021 16:54 IST

లోక్‌సభలో వాయిదాల పర్వం

దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే రైతుల ఆందోళనపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఇప్పుడు లోక్‌సభలోనూ అదే ఘటన పునరావృతమైంది. ప్రతిపక్షాల నిరసనలతో సభ పలుమార్లు వాయిదా పడింది. 

సాయంత్రం 4 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు రైతుల ఆందోళన అంశాన్ని లేవనెత్తారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. స్పీకర్‌ ఓంబిర్లా విజ్ఞప్తి చేస్తున్నా ఆందోళన చేయడంతో సభను 4.30 గంటలకు వాయిదా వేశారు. అయితే సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు నిరసన సాగించాయి. సీట్లలో నుంచి లేచి సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్‌ వారించినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మళ్లీ వాయిదా వేశారు. 

అంతకుముందు రాజ్యసభలోనూ రైతుల ఆందోళనపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయితే ఈ అంశంపై 15 గంటలు చర్చించేందుకు ప్రభుత్వం, విపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. అయినప్పటికీ కొన్ని పార్టీల సభ్యులు నినాదాలు చేయడంతో ఛైర్మన్‌ అసహనం వ్యక్తం చేశారు. ముగ్గురు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీలను ఒకరోజు పాటు సస్పెండ్‌ చేశారు.

ఇవీ చదవండి..

రైతుల ఆందోళన.. మరో షాహీన్‌బాగ్‌గా మార్చొద్దు!

సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని