అన్నాడీఎంకే పదవిపై కోర్టుకెక్కిన శశికళ
close

తాజా వార్తలు

Published : 18/02/2021 14:36 IST

అన్నాడీఎంకే పదవిపై కోర్టుకెక్కిన శశికళ

చెన్నై: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా జైలు నుంచి చిన్నమ్మ శశికళ రాక.. ఎన్నికలపై ఉత్కంఠను పెంచింది. ఇలాంటి సమయంలో అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు శశికళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు వ్యతిరేకంగా చెన్నై కోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకే బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవి చేపట్టారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేలోపే అవినీతి కేసులో జైలుకెళ్లారు. దీంతో పళనిస్వామిని సీఎం అయ్యారు. ఆ తర్వాత పళని, పన్నీర్‌సెల్వం వర్గాలు కలిసిపోయాయి. అనంతరం పళని, పన్నీర్‌ సెల్వం కలిసి అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. అందులో శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడమేగాక, పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే, ఈ నిర్ణయంపై 2017లో ఆమె న్యాయస్థానంలో దావా వేశారు. 

ఇటీవలే జైలు నుంచి విడుదలైన చిన్మమ్మ.. అన్నాడీఎంకే పార్టీని తన హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆమె జైలు నుంచి విడుదలై చెన్నైకి వస్తున్నప్పుడు కూడా తన కారుపై పార్టీ జెండా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మార్చి 15న విచారణ జరగనుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని