కరోనా నుంచి రైతులు సురక్షితంగా ఉన్నారా?

తాజా వార్తలు

Published : 07/01/2021 20:44 IST

కరోనా నుంచి రైతులు సురక్షితంగా ఉన్నారా?

కేంద్రాన్ని ప్రశ్నించిన ఉన్నత న్యాయస్థానం

దిల్లీ: దేశరాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు కరోనా నుంచి సురక్షితంగా ఉన్నారా.. అని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  రైతులంతా కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని ఉన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. కరోనా నిబంధనలు పాటించని కారణంగా నమోదైన పలు కేసుల్లో ఉపశమనం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం గురువారం విచారించింది. ‘‘ ఏం జరుగుతుందో మీరు మాకు చెప్పాలి. కరోనా ఇంకా ముగిసిపోలేదు. ఇప్పుడు కూడా అదే తప్పు జరుగుతోంది. కరోనా నుంచి రైతులు సురక్షితంగా ఉన్నారో లేదో మాకు చెప్పండి.’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని  త్రిసభ్య ధర్మాసం ఆదేశించింది. ధర్మాసనం అడిగిన ప్రశ్నకు సమాధానంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ‘రైతులు సురక్షితంగా లేరు.’ అని సమాధానమిచ్చారు. దీనిపై నివేదిక రూపొందించేందుకు సొలిసిటర్‌ జనరల్‌ రెండు వారాల గడువు కోరారు. లాక్‌డౌన్‌ సమయంలో దిల్లీ పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ సుప్రియా పండితా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిని విచారిస్తూ ‘మనం కరోనా విషయంపై జాగ్రత్త పడాలి. కొవిడ్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి.’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. 
గతేడాది జులై 5న దిల్లీలోని ఆనంద్‌ విహార్‌ బస్‌ టెర్మినల్‌ వద్ద ప్రజలు భారీ ఎత్తున గుమికూడటంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కేంద్రం హోంశాఖ సుప్రీంకోర్టుకు వివరాలు సమర్పించింది. అసత్య ప్రచారాల వల్లే ఆ సమయంలో ప్రజలు అలా గుమికూడారని కేంద్రం తెలిపింది. 

ఇవీ చదవండి..

నిషేధిత జాబితాలోకి అలీబాబా?

సరికొత్త ఎంజీ హెక్టార్‌ విడుదల


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని