వృద్ధుల చికిత్సకు ప్రాధాన్యమివ్వండి

తాజా వార్తలు

Published : 04/03/2021 14:24 IST

వృద్ధుల చికిత్సకు ప్రాధాన్యమివ్వండి

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించిన సుప్రీంకోర్టు

దిల్లీ: వృద్ధులు కరోనా కారణంగా ఇబ్బంది పడకుండా వారికి ఆస్పత్రుల్లో ప్రాధాన్యమిచ్చి చికిత్సను అందించాలని సుప్రీంకోర్టు గురువారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది. వృద్ధులు ఏ సమస్యతో వచ్చినా వారికి వెంటనే చికిత్స ప్రారంభించాలని న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. ఆగస్టు 4, 2020న ఇచ్చిన  తీర్పులో మార్పులు చేస్తూ జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, ఆర్.ఎస్.రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఈ తీర్పును వెలువరించింది. గతంలో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వృద్ధులకు ప్రాధాన్యమివ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

వయసు పైబడిన వారికి కరోనా ముప్పు అధికంగా ఉన్న నేపథ్యంలో న్యాయవాది అశ్వని కుమార్‌ వేసిన ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేసింది. వృద్ధుల అనారోగ్యాలు, సాధారణ చెకప్‌లకు వైద్యశాలల్లో ప్రాధాన్యతనివ్వాలని పిటిషనర్‌ కోరారు. ఈ అంశంపై వివిధ రాష్ట్రాలు తీసుకున్న చర్యలను తెలపాలని సుప్రీం ఆదేశించగా కేవలం ఒడిశా, పంజాబ్‌లు మాత్రమే స్పందించాయి. మిగిలిన రాష్ట్రాలు మూడు వారాల్లోగా తాము తీసుకున్న చర్యలు తెలియజేయాలని సుప్రీం ఆదేశించింది. వృద్ధులకు ఈ సమయంలో ప్రాధాన్యత నివ్వడం చాలా అవసరమని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై వివిధ రాష్ట్రాలకు న్యాయస్థానం ఎస్‌వోపీలు పంపాలని ఆయన కోరారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు మందులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు గతేడాది ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని