‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ వలసకూలీలకు చేరుతోందా?

తాజా వార్తలు

Published : 24/05/2021 13:05 IST

‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ వలసకూలీలకు చేరుతోందా?

వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌పై సుప్రీం అసంతృప్తి

దిల్లీ: కరోనా మహమ్మారితో మళ్లీ లాక్‌డౌన్‌లు అమలవుతున్న వేళ వలస కూలీలు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వలస కార్మికుల సమస్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రయోజనాలు వలస కూలీలకు అందుతున్నాయా? అని ప్రశ్నించింది. పథకాలు ఉన్నప్పటికీ, సరైన గుర్తింపు లేక ఎంతోమంది వాటిని పొందలేకపోతున్నారని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎంఆర్‌షాలతో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

‘‘గుర్తింపు, నమోదు ఉంటేనే వలస కూలీలకు పలు పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గతేడాది వలస కూలీల రిజిస్ట్రేషన్‌ చేపట్టాలని ఆదేశించినప్పటికీ అది నత్తనడకన సాగుతోంది. దీంతో పథకాలు ఉన్నప్పటికీ అవి లబ్ధిదారులకు చేరట్లేదు. మహమ్మారి సంక్షోభ సమయంలో వలస కార్మికులకు ఆహారం, రవాణా వంటి సదుపాయాలు కల్పించాలి. సంఘటిత, అసంఘటిత కార్మికులందరినీ నమోదు చేయాలి’’ అని ధర్మాసం సూచించింది. ఈ సందర్భంగా ఆత్మనిర్భర్‌ భారత్‌, జాతీయ ఆహార భద్రత చట్టం వంటివి వలస కార్మికులకు వర్తిస్తాయా లేదా అన్నదానిపై న్యాయస్థానం ఆరా తీసింది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్రయోజనాలు వలస కూలీలు పొందుతున్నారో లేదో తెలపాలని  అన్ని రాష్ట్రాలు, కేంద్రం తెలపాలని ఆదేశించింది. సమగ్ర వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని