SC: పేదరికమే లేకపోతే ఎందుకు యాచిస్తారు..?

తాజా వార్తలు

Updated : 28/07/2021 04:47 IST

SC: పేదరికమే లేకపోతే ఎందుకు యాచిస్తారు..?

దిల్లీ: భిక్షాటన చేసేందుకు ఎవరూ ఇష్టపడరని, పేదరికమే ఆ పరిస్థితి కల్పిస్తుందని మంగళవారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కరోనా మహమ్మారి వేళ బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనపై నిషేధం విధించడం కుదరదని తేల్చిచెప్పింది. యాచకులకు టీకాలు అందించడంతో పాటు పునరావాసం కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే ఈ అంశంపై కేంద్రం, దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

కరోనా విజృంభిస్తోన్న వేళ యాచకులు ట్రాఫిక్ జంక్షన్లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటన చేయడాన్ని అడ్డుకొని, వారికి పునరావాసం కల్పించాలంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ..‘పేదరికమే లేకపోతే ఎవరూ భిక్షాటన చేయాలనుకోరు’ అంటూ వ్యాఖ్యానించింది. విద్య, ఉపాధి లేకపోవడంతో కనీస జీవనం కోసం వారు యాచించాల్సి వస్తోందని అభిప్రాయపడింది. ‘ఇదొక సామాజిక-ఆర్థిక సమస్య. మహమ్మారి వేళ బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనను నిషేధించలేం’ అంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే విచారణలో భాగంగా రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని