close

తాజా వార్తలు

Published : 13/04/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రఫేల్ రగడ: సుప్రీంలో విచారణ

దిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం కొద్ది రోజుల క్రితం మరోసారి వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజా ఆరోపణల నేపథ్యంలో కొత్తగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై రెండు వారాల తరవాత సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి సోమవారం నిర్ణయం తీసుకున్నారు. 

రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉంటోంది. దాదాపు వారం రోజుల క్రితం మరోసారి దానిపై సంచలన కథనం వెలువడింది. ఈ విమానాల తయారీదారు దసో ఏవియేషన్ భారత్‌కు చెందిన ఒక మధ్యవర్తికి 10,17,850 యూరోల (రూ.8.8 కోట్లు)ను చెల్లించినట్లు ఫ్రెంచ్‌ పోర్టల్ ‘మీడియా పార్ట్‌’లో కథనం ప్రచురితమైంది. ఫ్రాన్స్‌ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించినట్లు పేర్కొంది. దసో సంస్థలో అవినీతి నిరోధక విభాగం అడిట్ చేసినప్పుడు ఈ విషయం వెల్లడైందని తెలిపింది. కాగా, ఫ్రెంచ్ పత్రిక కథనం నేపథ్యంలో రఫేల్ ఒప్పందంపై పూర్తిస్థాయి, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే అధికార భాజపా మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. దసో ఏవియేషన్ కూడా వాటిని ఖండించింది. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన దసో సంస్థ నుంచి 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుకు 2016లో భారత్ ఒక ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని