సరిహద్దుల్లోనే తిప్పికొడుతున్నాం

తాజా వార్తలు

Updated : 08/02/2021 13:51 IST

సరిహద్దుల్లోనే తిప్పికొడుతున్నాం

రాజ్యసభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌

దిల్లీ: తన కుట్రపూరిత చర్యలతో భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌ ఆగడాలను దేశ భద్రతాబలగాలు సరిహద్దులకు పరిమితం చేయడమేగాక, వారికి గట్టిగానే బుద్ధిచెబుతోందని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. దేశ సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 

‘‘2020లో 4,649 కాల్పుల ఉల్లంఘనలు జరిగాయి. వాటిని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. సరిహద్దుల్లో ఏమరపాటుగా ఉండే ప్రశ్నే లేదు. భద్రతాదళాలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటున్నాయి. దాయాది పాక్‌ క్రూరమైన చర్యలను సరిహద్దులకే పరిమితం చేస్తూ సమర్థంగా తిప్పికొడుతున్నాయి’’ అని రాజ్‌నాథ్ తెలిపారు. 

మరో 11 రఫేల్‌ విమానాల రాక..

ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా మరో 11 రఫేల్‌ యుద్ధ విమానాలు దేశానికి రానున్నాయని, ఈ ఏడాది మార్చి నాటికి వాయుసేనలో మొత్తం రఫేల్‌ విమానాల సంఖ్య 17కు చేరుతుందని రక్షణమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 2022 ఏప్రిల్‌ నాటికి ఫ్రాన్స్‌ అన్ని రఫేల్‌లను భారత్‌కు అందించనుందని వెల్లడించారు. రక్షణ రంగంలో దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్ తెలిపారు. రక్షణకు సంబంధించిన 101 ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా భారత్‌లోనే తయారీ చేయాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 

ఇవీ చదవండి..

సాగు చట్టాలపై ప్రతిపక్షాలది యూటర్న్‌

న్యూయార్క్‌ అసెంబ్లీలో ‘కశ్మీర్‌’ తీర్మానం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని