
తాజా వార్తలు
‘జన్ శతాబ్ది’ విస్టాడోమ్ కోచ్లు చూశారా?
నేడు 8 రైళ్లను ప్రారంభించనున్న మోదీ
దిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల నుంచి గుజరాత్లోని కెవాడియాకు ఎనిమిది రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ రేపు ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రారంభించబోయే జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు ఫొటోలను ఆయన షేర్ చేశారు. ‘‘అహ్మదాబాద్ నుంచి కెవాడియా మధ్య రేపు ప్రారంభించబోయే రైళ్లలో జన్శతాబ్ది రైలు ఒకటి. దీంట్లో విస్టాడోమ్ కోచ్లు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
నర్మదా నదీ తీరాన నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యతా విగ్రహం) సర్దార్ వల్లభ్ భాయ్పటేల్ విగ్రహం ఉన్న కెవాడియా ప్రాంతాన్ని కలుపుతూ ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లతో పాటు గుజరాత్లో పలు రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొననున్నారు.
ఇదీ చదవండి..