‘రక్షణ’ తయారీలో స్వావలంబనే కీలకం

తాజా వార్తలు

Published : 05/02/2021 22:35 IST

‘రక్షణ’ తయారీలో స్వావలంబనే కీలకం

ఏరో ఇండియా షో ముగింపు వేడుకల్లో రాజ్‌నాథ్

బెంగళూరు: భారత్‌ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కొనసాగించాలంటే రక్షణ పరికరాల తయారీలో స్వావలంబన సాధించడం కీలకమైన అంశమని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అన్నారు. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా-2021 ముగింపు వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

అంతకుముందు ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ‘స్టార్టప్‌ మానథాన్‌’ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ ప్రసంగించారు. రక్షణ తయారీ రంగంలో స్టార్టప్‌లు ఆవశ్యతకను కేంద్రమంత్రి ప్రస్తావించారు. వైమానిక రంగంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, దాదాపు 300లకు పైగా స్టార్టప్‌లు విమానయాన రంగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయని కొనియాడారు. ఇక ఐడెక్స్‌(ఇన్సోవేషన్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌) కింద 10 స్టార్టప్‌లు రూ. 100కోట్ల ఉత్పత్తులను అభివృద్ధి చేశాయని అన్నారు. ఈ ఏడాది ఏరో ఇండియా షోలో పాల్గొన్న 45 ఎంఎస్‌ఎంఈలకు ఇప్పటికే రూ. 203కోట్ల విలువైన ఆర్డర్లు రావడం ఆనందంగా ఉందన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా ఐడెక్స్‌ నిర్ణయాత్మక అడుగు కానుందని రాజ్‌నాథ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 

అనంతరం ఏరో ఇండియా షో ముగింపు వేడుకల్లో రాజ్‌నాథ్‌ పాల్గొని ప్రసంగించారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ ఏరోఇండియా ప్రదర్శన విజయవంతమైందని ప్రశంసించారు. ఈ ప్రదర్శలో 55 దేశాలకు చెందిన 84 సంస్థలతో పాటు 540 రక్షణ రంగ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించినట్లు తెలిపారు. దాదాపు 120 ఒప్పందాలు జరిగినట్లు వెల్లడించారు. వచ్చే ఏడేనిమిదేళ్లలో 130 బిలియన్‌ డాలర్లతో మిలిటరీని ఆధునికీకరించనున్నట్లు రాజ్‌నాథ్ చెప్పారు. 

ఇదీ చదవండి..

సాహసానికి ఆకాశమే హద్దు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని