కొవిషీల్డ్‌ డోసుల కోసం కేంద్రం ఆర్డర్‌

తాజా వార్తలు

Published : 11/01/2021 16:48 IST

కొవిషీల్డ్‌ డోసుల కోసం కేంద్రం ఆర్డర్‌

దిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకా డోసుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు ఆర్డర్‌ పెట్టింది. ఈ మేరకు సీరమ్‌ ప్రతినిధులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపటి నుంచి పుణె నుంచి టీకా రవాణా చేపట్టనున్నారు. కాగా.. కొవిషీల్డ్‌ ధర డోసుకు రూ. 200గా ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి దశలో భాగంగా 11 మిలియన్ల డోసులను సీరమ్‌.. ప్రభుత్వానికి అందించనుంది. 

దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించడం కోసం కొవిషీల్డ్‌తో పాటు భారత్‌ బయోటెక్‌ టీకాల అత్యవసర వినియోగానికి కేంద్రం ఇటీవల అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు గతవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తొలి ప్రాధాన్యం కింద 3 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా అందించనున్నారు. ఆ తర్వాత 50ఏళ్లు పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే 50ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. జులై నాటికి 30కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇవీ చదవండి..

మొదటిసారి 200 దిగువకు మరణాలు

కరోనా ఎఫెక్ట్‌: తొలిసారి బడ్జెట్‌ ప్రతులు లేకుండా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని