సీరం, యూనిసెఫ్‌ వ్యాక్సిన్‌ ఒప్పందం

తాజా వార్తలు

Published : 05/02/2021 02:07 IST

సీరం, యూనిసెఫ్‌ వ్యాక్సిన్‌ ఒప్పందం

దీర్ఘకాల సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న ఇరుపక్షాలు

జెనీవా: సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, యూనిసెఫ్‌ దీర్ఘకాల సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యూనిసెఫ్‌ గురువారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్‌ సంస్థలకు చెందిన 1.1 బిలియన్‌ వ్యాక్సిన్లను 100 దేశాలకు పంపనున్నట్లు వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కొవాక్స్‌’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలు పేద దేశాలకు తక్కువ ధరకే వ్యాక్సిన్‌ను అందించనున్నారు. ‘‘సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో దీర్ఘకాల వ్యాక్సిన్‌ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఇందులో ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్‌ సంస్థల వ్యాక్సిన్లు ఉన్నాయి.’’ అని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ తెలిపారు. కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా 145దేశాలకు ఈ ఏడాది మధ్యలోగా వ్యాక్సిన్లను అందిస్తామని తెలిపారు. 336 మిలియన్ల ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్లను కూడా ఇందులో భాగంగా పంపిణీ చేస్తామని తెలిపారు. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాల్లోని 3.3శాతం ప్రజలకు వ్యాక్సిన్లు అందుతాయని వారు తెలిపారు. ఇప్పటికే అన్ని దేశాల్లోని ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ రవాణా, నిల్వ వంటి వాటిలో శిక్షణనిచ్చారని తెలిపారు. వ్యాక్సిన్లతో పాటు వాటికి అవసరమైన సిరంజిలు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూనిసెఫ్‌ తెలిపింది. ఇప్పటికే వ్యాక్సిన్ల రవాణాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు.

ఇవీ చదవండి..

ఆ ట్వీట్ల వెనక కుట్ర ఉంది

296 యాప్స్‌ నిషేధించాం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని