Afghan crisis: ‘స్వాతంత్ర్య ’ ర్యాలీపై తాలిబన్ల తూటాల వర్షం..!

తాజా వార్తలు

Updated : 19/08/2021 22:13 IST

Afghan crisis: ‘స్వాతంత్ర్య ’ ర్యాలీపై తాలిబన్ల తూటాల వర్షం..!

కాబుల్‌: తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో ముష్కరుల విధ్వంసకాండ మొదలైంది. నిన్నటికి నిన్న తాలిబన్లపై నిరసన ప్రదర్శన చేసిన కొందరిపై కాల్పులు జరపగా.. తాజాగా నేడు దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేపట్టిన ర్యాలీపై తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 

అఫ్గానిస్థాన్‌లో ఏటా ఆగస్టు 19న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటారు. ఈ సారి తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. అయితే అసదాబాద్‌ నగరంలో కొందరు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. దీంతో తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు. తుపాకుల శబ్దంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. కాల్పులు, తొక్కిసలాట కారణంగా పలువురు మృతిచెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని