close

తాజా వార్తలు

Published : 05/05/2021 10:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌!

లేకుంటే ఆ తరహా ఆంక్షలు

దిల్లీ: కరోనా రెండో దశ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా కఠిన లాక్‌డౌన్‌ విధించాలన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. ఇప్పటికే భారతావనిలోని చాలా ప్రాంతం వివిధ సమయాలకు గాను ఆ తరహా వాతావరణంలోకి జారుకుంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రకటించిన కఠిన ఆంక్షలను ఓ మారు పరిశీలిస్తే..

దిల్లీ గత నెల 19 నుంచి లాక్‌డౌన్‌లో ఉంది. ఈ నెల 10 వరకు అక్కడే ఇదే పరిస్థితి.

హరియాణాలో ఈ నెల మూడో తేదీ నుంచి ఏడు రోజుల లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది.

ఒడిశాలో ఈ నెల 5 (నేటి) నుంచి 19 వరకు 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. 

రాజస్థాన్‌లో ఈ నెల 17వరకు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు. 

కర్ణాటక గత నెల 27 రాత్రి నుంచి మే 12 వరకు లాక్‌డౌన్‌ పాటిస్తోంది.

ఝార్ఖండ్‌లో గత నెల 22 నుంచి మే 6 వరకు లాక్‌డౌన్‌ తరహా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. 

ఛత్తీస్‌గఢ్‌లో నేటితో ముగియనున్న లాక్‌డౌన్‌ని 15 వరకు పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు అమనుతి మంజూరు చేసింది. 

పంజాబ్‌లో వారాంతపు లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ వంటివి ఈ నెల 15 వరకు అమల్లో ఉండనున్నాయి. 

మధ్యప్రదేశ్‌ ఈ నెల 7 వరకు కరోనా కర్ఫ్యూ అమలు చేస్తోంది. 

గుజరాత్‌లోని 29 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. 

మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను ఈ నెల 15 వరకు పొడిగించింది. 

తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 20వరకు కఠిన ఆంక్షలు విధించింది. 

కేరళ మంగళవారం నుంచి ఈ నెల 9 వరకు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నట్లు ప్రకటించింది. 

పుదుచ్చేరిలో ఈ నెల 10 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.

పశ్చిమబెంగాల్‌ గతవారం నుంచి అన్నిరకాల సమావేశాలపై నిషేధం విధించింది. 

అస్సాంలో గత నెల 27 నుంచి ఈ నెల 7 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. 

నాగాలాండ్‌లో గత నెల 30 నుంచి ఈ నెల 14 వరకు పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. 

ఉత్తరాఖండ్‌ రాత్రిపూట కర్ఫ్యూని మళ్లీ అమలు చేస్తోంది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని