దేశ్‌ముఖ్‌ రాజీనామా అవసరంలేదు

తాజా వార్తలు

Published : 22/03/2021 14:18 IST

దేశ్‌ముఖ్‌ రాజీనామా అవసరంలేదు

దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసు దర్యాప్తును దృష్టి మళ్లించేందుకే మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేశారని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. హోం మంత్రి ప్రతినెలా రూ.100 కోట్ల వసూళ్లను సచిన్‌ వాజేకు లక్ష్యంగా పెట్టారంటూ ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌ వీర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు రాసిన లేఖ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై పవార్‌ నేడు మీడియాతో మాట్లాడారు. 

‘‘ఇక్కడ ముఖ్యమైన అంశం.. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కేసు. ఈ ఘటనలో ఏటీఎస్‌ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. దీంతో మన్‌సుఖ్ హిరేన్‌ను ఎవరు చంపారో స్పష్టత వచ్చింది. దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటపడతాయి. ముంబయి ఏటీఎస్‌ దర్యాప్తు సరైన దారిలో సాగుతోంది. అయితే దాన్ని తప్పుదోవ పట్టించేందుకే పరమ్‌ వీర్‌ సింగ్‌ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. పరమ్‌వీర్‌ లేఖను చూసినట్లయితే.. ఫిబ్రవరి మధ్యలో హోంమంత్రి నుంచి ఆదేశాలు వచ్చాయని అన్నారు. కానీ, ఫిబ్రవరి 5-15 వరకు దేశ్‌ముఖ్‌ కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఫిబ్రవరి 27 వరకు క్వారంటైన్‌లో ఉన్నారు. దీన్ని బట్టి.. పరమ్‌వీర్‌ చేసిన ఆరోపణలు అవాస్తవం అని అర్థమవుతోంది’’ అని పవార్‌ చెప్పుకొచ్చారు. 

ఆరోపణలు అబద్ధమని తేలినప్పుడు దేశ్‌ముఖ్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్లకు ఎలాంటి అర్థం లేదని పవార్‌ ఈ సందర్భంగా అన్నారు. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, అంతేగాక.. దీనిపై శివసేన నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి రాలేదని వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని