శరద్‌పవార్‌కు  మళ్లీ శస్త్ర చికిత్స

తాజా వార్తలు

Published : 25/04/2021 17:57 IST

శరద్‌పవార్‌కు  మళ్లీ శస్త్ర చికిత్స

ముంబయి:ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌కు ముంబయిలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్సకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్‌మాలిక్‌ వెల్లడించారు. నోటిలో ఏర్పడిన ఓ అల్సర్‌ (పుండు)ను తొలగించేందుకు డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారని చెప్పారు. త్వరలోనే ఆయన కోలుకొని సాధారణ స్థితికి వస్తారని అన్నారు. మార్చి 30న ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో శరద్‌పవార్‌కు పిత్తాశయ శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. పిత్తాశయంలో ఏర్పడిన చిన్నరాయిని ఎండోస్కోపి విధానం ద్వారా వైద్యులు తొలగించారు. అయితే శస్త్ర చికిత్స అనంతరం చేసిన మరికొన్ని వైద్య పరీక్షల్లో ఆయన నోటిలో అల్సర్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో మరోసారి చికిత్స చేసి దానిని తొలగించనున్నారు.

‘‘ప్రస్తుతం శరద్‌పవార్‌ ఆరోగ్యంగానే ఉన్నారు. ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆయన  ఆరోగ్యాన్ని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనూ పూర్తిగా కోలుకొని పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారు’’ అని మాలిక్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని