Pogonotrophy: అంటే ఏంటో తెలుసా?

తాజా వార్తలు

Published : 02/07/2021 23:02 IST

Pogonotrophy: అంటే ఏంటో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో ఆంగ్ల పదాలలో కవ్వించే కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ తాజాగా ‘పొగొనోట్రోఫీ’ అనే మరో ఆంగ్ల పదాన్ని నెటిజన్ల ముందుకు తీసుకువచ్చారు. ట్విటర్‌ ద్వారా డా.ప్రియా ఆనంద్‌ అనే ఓ నెటిజన్‌ ఏదైనా ఆంగ్ల పదాన్ని చెప్పమని కోరగా ఆమె అభ్యర్థన మేరకు కాంగ్రెస్‌ నేత పొగొనోట్రోఫీ అనే ఆంగ్ల పదాన్ని వెలుగులోకి తెచ్చారు. 

ఆర్థికవేత్త అయిన రతిన్‌ రాయ్‌ చెప్పిన ఓ పదాన్ని, దాని అర్థాన్ని తెలియజేస్తూ డా.ప్రియా ఆనంద్‌కు రిప్లై ఇచ్చారు. ‘‘నా మిత్రుడు రితిన్‌ రాయ్‌ ద్వారా  నేర్చుకున్న పదం ‘పొగొనోట్రోఫీ’ (pogonotrophy). దీనర్థం ‘గడ్డాన్ని పెంచడం’. కరోనా మహమ్మారి సమయంలో ప్రధాన మంత్రి గడ్డం పెంచడం మాదిరిగా..’’ అని శశిథరూర్‌ ఛలోక్తి విసిరారు.

శశిథరూర్‌ ఇలాంటి పదాలను ప్రయోగిస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరచడం కొత్తేమీ కాదు. ఆ మధ్య తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పలకడానికి కష్టంగా ఉన్న ఔషధాల పేర్ల గురించి చేసిన ట్వీట్‌కు స్పందించిన శశిథరూర్‌ 29 అక్షరాలతో కూడిన Floccinaucinihilipilification అనే ఆంగ్ల పదాన్ని పరిచయం చేశారు. అది కాస్తా అప్పట్లో వైరల్ అయ్యింది. కాగా ఆ పదానికి ‘అవసరం లేని పని లేదా అలవాటు’ అని అర్థం. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని