close

తాజా వార్తలు

Updated : 07/03/2021 05:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అతడి మృతికి గల కారణాలు తేలుస్తాం

ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ నివాసానికి దగ్గర్లో పేలుడు పదార్థాల వాహనం కేసు మలుపులు తిరుగుతోంది. ఆ వాహన యజమానిగా చెబుతున్న హిరేన్ మన్‌సుఖ్ శవమై కనిపించడం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆ మృతి వెనుక కారణాలు వెలికితీయడం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు చాలా అవసరమని శనివారం శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. 

‘ఈ మరణాన్ని రాజకీయం చేసి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం తప్పు. అది హత్య, ఆత్మహత్యో తేలాల్సి ఉంది. మన్‌సుఖ్ ఈ కేసులో ప్రధాన సాక్షి. మా ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా వాస్తవాలను వెలికితీస్తుంది. మహావికాస్ అఘాడీ ప్రభుత్వ ప్రతిష్టకు ఇది చాలా అవసరం’ అని రౌత్ విపక్షాల విమర్శలను తోసిపుచ్చారు. 

దక్షిణ ముంబయిలోని అంబానీ ఇంటికి సమీపంలో ఫిబ్రవరి 25న జిలెటిన్ స్టిక్స్‌తో ఉన్న ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. ఆ వాహనం తనదేని, అది చోరీకి గురైందని మన్‌సుఖ్ పోలీసులకు తెలిపారు. దానిపై అంతకుముందే ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఆయన.. ఠాణేలోని సముద్రపు ఒడ్డున శవమై కనిపించారు. మరోవిషయం ఏంటంటే..అసలు ఆ వాహనానికి యజమాని మన్‌సుఖ్ కాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్ తెలిపారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని