సీరం ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణం

తాజా వార్తలు

Published : 13/02/2021 01:51 IST

సీరం ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణం

వెల్లడించిన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి

ముంబయి: జనవరి 21న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో జరిగిన అగ్ని ప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూటే కారణమని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు. ఈ ఘటనపై అన్ని అంశాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన శుక్రవారం వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో నిర్మాణంలో ఉన్న ఆ భవనంలో వెల్డింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆ భవనంలోని నాలుగు, ఐదు, ఆరు అంతస్తులు పూర్తిగా కాలిపోయాయని ప్రధాన అగ్నిమాపకాధికారి ప్రశాంత్‌ తెలిపారు.

ఈ అగ్నిప్రమాద ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించారు. వంద ఎకరాల్లో ఉన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ భవనంలో ఉన్న వెయ్యి కోట్ల రూపాయలు ఖరీదు చేసే పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయని సీరం సీఈవో అదర్‌పూనావాలా తెలిపారు. ఈ ఘటన వల్ల వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఆటంకాలు ఎదురవ్వలేదని ఆయన వెల్లడించారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై పలు వదంతులు వ్యాప్తిస్తుండటంతో దాని కారణాలను మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రమాదంపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు సేకరించామని అజిత్‌ పవార్‌ తెలిపారు.

ఇవీ చదవండి..

దిగొచ్చిన ట్విటర్‌

చైనా..యూకే మీడియా యుద్ధం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని