భారత్‌లో హృదయవిదారక పరిస్థితులు: టెడ్రస్‌

తాజా వార్తలు

Updated : 27/04/2021 10:12 IST

భారత్‌లో హృదయవిదారక పరిస్థితులు: టెడ్రస్‌

జెనీవా: భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు చూస్తుంటే హృదయ విదారక స్థితిని మించిపోయినట్లు అనిపిస్తోందని వెల్లడించింది. భారత్‌కు సాయం చేసేందుకు సంస్థ కృషి చేస్తోందని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్‌ అధానోమ్‌ సోమవారం విలేకరులతో మాట్లాడారు.

‘భారత్‌లో ప్రస్తుత పరిస్థితులు హృదయాన్ని కలచివేస్తున్నాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వీలైనంత మేరకు శాయశక్తులా కృషి చేస్తోంది. వైద్య సామగ్రి, వేలాదిగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ల్యాబోరేటరీ పరికరాలు అందిస్తోంది. అంతేకాకుండా భారత్‌కు సిబ్బంది సహకారం అందించేందుకు డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే ముందడుగు వేసింది. అందులో భాగంగా 2,600 మంది వైద్య నిపుణుల్ని డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే భారత్‌కు బదిలీ చేస్తూ ప్రకటించినట్లు’ టెడ్రస్‌ తెలిపారు. 

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. నిన్న 3.52లక్షల కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 2,812 మంది మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని