శాకాహారుల్లో కొవిడ్‌ వ్యాప్తి తక్కువేనా..?

తాజా వార్తలు

Published : 26/04/2021 01:10 IST

శాకాహారుల్లో కొవిడ్‌ వ్యాప్తి తక్కువేనా..?

సీఎస్‌ఐఆర్ సర్వేలో ఆసక్తికర అంశాలు

దిల్లీ: శాకాహారుల్లో కొవిడ్‌ వ్యాప్తి తక్కువగానే ఉంటోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతేకాకుండా ‘ఓ’ రకం బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారు కూడా వైరస్‌ బారినపడే అవకాశాలు తక్కువేనని తాజా సర్వేలో తేలింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీల స్థాయిను అంచనా వేసేందుకు కేంద్ర పరిశోధన సంస్థ సీఎస్‌ఐఆర్‌ చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు, వైరస్‌ను ఎదుర్కోవడంలో అవి ప్రతిస్పందించే సామర్థ్యాలను తెలుసుకునేందుకు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) దేశవ్యాప్తంగా సెరోసర్వే నిర్వహించింది. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన 140 వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టింది. ఇందుకు దేశవ్యాప్తంగా ఉన్న 40 సీఎస్‌ఐఆర్‌ ల్యాబ్‌ల సిబ్బంది వారి కుటుంబీకులు మొత్తం 10,427 మంది సమాచారాన్ని విశ్లేషించారు.

శాకాహారుల్లో వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉన్నట్లు తాజా సర్వే గుర్తించింది. ఇలా కరోనా వైరస్‌ తక్కువగా వెలుగు చూడడానికి కొన్ని కారణాలను సర్వే విశ్లేషించింది. శాకాహారులు తినే ఆహారంలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్‌ కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. ఇక ‘O’ బ్లడ్‌ గ్రూప్‌నకు చెందిన వారిలో వైరస్‌ బారినపడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తాజా సర్వే గుర్తించింది. B, AB రకం ఉన్నవారిలో వైరస్‌ బారిన పడే ప్రమాదం కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలిపింది. తాజా అధ్యయనం పరిశీలన(పీర్‌-రివ్యూ) కూడా పూర్తయ్యిందని అధ్యయనం సహరచయిత శంతను సేన్‌ గుప్తా పేర్కొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని