Indian Army: 24 గంటలు శ్రమించి కుటుంబానికి సాయం

తాజా వార్తలు

Published : 18/05/2021 23:28 IST

Indian Army: 24 గంటలు శ్రమించి కుటుంబానికి సాయం

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో మంచుకొండల్లో చిక్కుకున్న ఓ గొర్రెల కాపరుల కుటుంబానికి సైనిక సిబ్బంది 24 గంటలపాటు ట్రెక్కింగ్‌ చేసి ఆహారాన్ని అందించింది. బషీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి, అతడి భార్య, ఇద్దరు పిల్లలు గొర్రెల మందతో కలిసి కతువా ప్రాంతం నుంచి మారువా లోయకు వెళుతున్నారు. ఈ క్రమంలో 11 వేల మీటర్ల ఎత్తులో ఉన్న నాల్కెన్‌సుర్‌ శిఖరం వద్ద మంచులో ఈ కుటుంబం చిక్కుకుంది. కాగా సహాయం కోసం ఆర్మీకి చెందిన చత్రు సబ్‌డివిజన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సైన్యం ప్రతికూల వాతావరణంలో 24 గంటలపాటు ప్రయాణించి బషీర్‌ కుటుంబానికి ఆహారం, మందులు, ఇతర వస్తువులు అందించింది. తక్షణ సాయం అందించిన సైన్యానికి గొర్రెల కాపరి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని