Vaccine: ‘సోనియాగాంధీ టీకా తీసుకున్నారు’
close

తాజా వార్తలు

Published : 17/06/2021 21:46 IST

Vaccine: ‘సోనియాగాంధీ టీకా తీసుకున్నారు’

భాజపా నేతల విమర్శలపై స్పందించిన కాంగ్రెస్‌

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియాగాంధీతో పాటు ఆమె కుటుంబీకులు కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు విముఖత చూపుతున్నట్లు భాజపా చేస్తోన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. సోనియా గాంధీ ఇప్పటికే వ్యాక్సిన్‌ తీసుకున్నారని.. కొవిషీల్డ్‌ రెండు డోసులు పూర్తయ్యాయని స్పష్టం చేసింది. ప్రియాంక గాంధీ వాద్రా కూడా తొలిడోసు తీసుకున్నారని తెలిపింది. ఇక రాహుల్‌ గాంధీ కరోనా బారిన పడినందున.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొంత వ్యవధి తర్వాత వ్యాక్సిన్‌ తీసుకుంటారని వెల్లడించింది.

‘రాహుల్‌గాంధీ ఏప్రిల్‌ 16వ తేదీనే వ్యాక్సిన్‌ తీసుకోవాలని భావించారు. అదే సమయంలో కొవిడ్‌ లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు కొంత వ్యవధి తర్వాత టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ గడువు తీరిన వెంటనే రాహుల్‌ గాంధీ కూడా వ్యాక్సిన్‌ తీసుకుంటారు’ అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా పేర్కొన్నారు. ఇక ప్రియాంక గాంధీ కూడా వ్యాక్సిన్‌ తొలిడోసును మార్చి 28నే తీసుకున్నారని చెప్పారు. అనంతరం ఆమె భర్తకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, అందుకే వారు వ్యాక్సిన్‌ డోసు పూర్తిచేయలేదని పేర్కొన్నారు.

గాంధీ కుటుంబం కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోవడమే కాకుండా వ్యాక్సినేషన్‌పై అనుమానాలు లేవనెత్తుతోందని భాజపా నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన కాంగ్రెస్‌, ఇలాంటి అనవసర విషయాలను సృష్టించడానికి బదులు దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించడంలో కేంద్ర ప్రభుత్వం రాజధర్మం పాటించాలని సూచించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిత్యం సరాసరి 17లక్షల డోసులనే పంపిణీ చేస్తున్నారని.. ఈ లెక్కన దేశం మొత్తం వ్యాక్సిన్‌ అందించాలంటే దాదాపు రెండున్నరేళ్ల సమయం పడుతుందని మండిపడింది. ఇలా కాకుండా నిత్యం 80లక్షల నుంచి కోటి మందికి వ్యాక్సిన్‌ అందించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని