దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జుమాకు జైలు శిక్ష

తాజా వార్తలు

Published : 29/06/2021 23:54 IST

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జుమాకు జైలు శిక్ష

కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం తీర్పు

జోహెన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ 15 నెలల పాటు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. 2009 నుంచి 2018 వరకు దాదాపు తొమ్మిదేళ్ల పాటు పదవిలో ఉన్న జుమాపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ కమిషన్‌ ఎదుట హాజరు కావాలని గతంలో కోర్టు ఆదేశించింది. అయితే, ఆయన విచారణ కమిటీ ముందు హాజరు కాకపోవడంతో దోషిగా తేల్చింది. ఈ తీర్పు సమయంలో జుమా కోర్టులో లేరు. అయితే, ఐదు రోజుల్లో ఆయన తన స్వస్థలం/ జోహెన్నెస్‌ బర్గ్‌లోని పోలీస్టేషన్‌లో హాజరు కావాలని న్యాయస్థానం సూచించింది. లేకపోతే, మూడు రోజుల్లో ఆయన్ను కస్టడీలోకి తీసుకోవాలని సంబంధిత శాఖ మంత్రి, పోలీస్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేసింది. ఒక మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష విధించడం దక్షిణాఫ్రికా దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.  డిప్యూటీ చీఫ్‌ జస్టిస్‌ రైమాండ్‌జొండో సారథ్యంలోని విచారణ కమిషన్‌ ఎదుట హాజరై దర్యాప్తునకు సహకరించాలన్న ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను జుమా ధిక్కరించారని న్యాయమూర్తి పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని