Sputnik: చివరిదశకు చేరుకున్న సింగిల్ డోసు టీకా
close

తాజా వార్తలు

Published : 26/05/2021 01:17 IST

Sputnik: చివరిదశకు చేరుకున్న సింగిల్ డోసు టీకా

దిల్లీ: కరోనా కట్టడి కోసం సింగిల్‌ డోసుగా అభివృద్ధి చేసిన టీకా ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయని రష్యా తెలిపింది. స్పుత్నిక్‌ లైట్ పేరిట ఆ దేశం ఈ టీకాను సిద్ధం చేసింది. ‘స్పుత్నిక్ లైట్ టీకాపై మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి’ అని భారత్‌లోని రష్యా రాయబారి రోమన్ బబుష్కిన్ మీడియాకు వెల్లడించారు. ఈ నెల చివరినాటికి ప్రయోగ ఫలితాలు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే భారత్‌ టీకా తయారీ సామర్థ్యాన్ని ఆయన ప్రశంసించారు. ఔషధాల ఉత్పత్తిలో భారత్ ముందు వరసలో ఉందని కొనియాడారు.

మరోవైపు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాకు భారత ప్రభుత్వం అత్యవసర వినియోగం కింద ఆమోదం తెలిపింది. దాంతో కొవాగ్జిన్, కొవిషీల్డ్ తరవాత భారత్‌లో అందుబాటులోకి వచ్చిన మూడో టీకా ఇది. ఇక్కడ డాక్టర్ రెడ్డీస్ ఆ టీకా పంపిణీని చేపట్టింది. అలాగే ఇప్పటికే రెండు దఫాలుగా స్పుత్నిక్-వి టీకా భారత్‌కు చేరుకుంది. ఇతర దేశాలతో కుదిరిన ఒప్పందాల ఆధారంగా స్పుత్నిక్‌-వి టీకా సరఫరా ఉంటుందని ఆ దేశ రాయబారి తెలిపారు. స్పుత్నిక్-వి టీకాను అభివృద్ధి చేసిన ఆర్‌డీఐఎఫ్, ఒకే డోసు స్పుత్నిక్ లైట్‌ టీకాను రూపొందించింది. దీనికి ఇప్పటికే రష్యాలో అత్యవసర అనుమతి లభించింది. అలాగే కొవిడ్‌ను అదుపు చేయడంలో ఒకే డోసు టీకా 79.4 శాతం సామర్థ్యాన్ని చూపినట్లు ఆర్‌డీఐఎఫ్ తెలిపింది. జులై నాటికి స్పుత్నిక్‌ లైట్ భారతదేశానికి అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని