డెల్టా వేరియంట్‌కు స్పుత్నిక్‌ బూస్టర్‌ డోస్‌
close

తాజా వార్తలు

Published : 17/06/2021 20:32 IST

డెల్టా వేరియంట్‌కు స్పుత్నిక్‌ బూస్టర్‌ డోస్‌

మాస్కో: డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు కరోనా బూస్టర్‌ డోసును సిద్ధం చేస్తున్నట్లు స్పుత్నిక్‌-వి టీకాను తయారుచేసిన గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. ఈ బూస్టర్‌ డోసును ఇతర వ్యాక్సిన్‌ తయారీదారులకు అందజేయనున్నట్లు పేర్కొంది. డెల్టా వేరియంట్‌పై ఇది సమర్థంగా పనిచేస్తుందని తెలిపింది. అయితే, ఏయే వ్యాక్సిన్‌ తయారీదారులకు ఈ బూస్టర్‌ డోసు అందజేసేదీ వివరాలు వెల్లడించలేదు.

కరోనా డెల్టా వేరియంట్‌ (B.1.617.2) తొలుత భారత్‌లో గుర్తించారు. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే వేగంగా విస్తరిస్తుండడం పట్ల ప్రపంచవ్యాప్తంగా  పలు దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెల్టాపై తన బూస్టర్‌ సమర్థంగా పనిచేస్తుందని స్పుత్నిక్‌ పేర్కొంది. మరోవైపు స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను దేశీయంగా రెడ్డీస్‌ లేబోరేటరీస్‌ మార్కెట్‌లోకి తెస్తోంది. ప్రస్తుతం పరీక్షలు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ వ్యాక్సిన్‌ ₹948కి లభించనుంది. దీనికి 5 శాతం జీఎస్టీ అదనం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని