చైనా టీకాలకు.. శ్రీలంక రాం రాం!
close

తాజా వార్తలు

Published : 23/02/2021 18:11 IST

చైనా టీకాలకు.. శ్రీలంక రాం రాం!

కొలంబో: తమదేశంలో త్వరలో మొదలుకానున్న రెండో దఫా కరోనా టీకా పంపిణీలో చైనా వ్యాక్సిన్లను వాడబోమని శ్రీలంక ప్రకటించింది. చైనా, రష్యా తయారుచేస్తున్న టీకాలు ఇంకా సిద్ధం కాకపోవటంతో తాము ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను మాత్రమే వినియోగించనున్నామని.. ఆ దేశ ఉద్యానవన శాఖామంత్రి రమేశ్‌ పథిరణ స్పష్టం చేశారు. అంతేకాకుండా టీకా మూడో దశ ప్రయోగాలకు సంబంధించిన పత్రాలను చైనా సమర్పించలేదని ఆయన వెల్లడించారు.

శ్రీలంకకు భారత్‌ ఉచితంగా అందచేసిన ఐదు లక్షల మోతాదుల టీకాతో ఆ దేశంలో తొలి దఫా కరోనా టీకా పంపిణీ జనవరిలో మొదలైంది. ఆపై కోటి డోసుల ఆస్ట్రాజెనెకా టీకాను సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఖరీదు చేయగా మరో 35 లక్షల డోసుల టీకాలు కోవాక్స్‌ కార్యక్రమం కింద ఆ దేశానికి లభించాయి. కాగా రెండో విడత పంపిణీ ఎపుడు ప్రారంభించేదీ వైద్య నిపుణుల సూచనల మేరకు  ప్రభుత్వం నిర్ణయిస్తుందని శ్రీలంక మంత్రి రమేశ్‌ పథిరణ తెలిపారు.

ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ కేంద్రంగా అవతరించిన భారత్‌.. శ్రీలంకతో పాటు భూటాన్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, సీషెల్స్‌, ఆప్ఘనిస్థాన్‌, మారిషస్‌ తదితర దేశాలకు కూడా కొవిడ్‌ టీకాలను అందచేస్తామని వాగ్దానం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని