కిరీటం లాక్కున్న ‘మిసెస్‌ వరల్డ్‌’అరెస్ట్ 
close

తాజా వార్తలు

Published : 09/04/2021 01:09 IST

కిరీటం లాక్కున్న ‘మిసెస్‌ వరల్డ్‌’అరెస్ట్ 

కొలంబో: ‘మిసెస్‌ శ్రీలంక’ పోటీల్లో వేదికపై గందరగోళం సృష్టించిన మిసెస్‌ వరల్డ్‌ కరోలిన్‌ జూరీని పోలీసులు అరెస్టు చేశారు. కొలంబోలోని నీలమ్‌ పోకునా థియేటర్‌లో ఆస్తి నష్టం కలిగించడంతో పాటు మిసెస్‌ శ్రీలంక 2021 విన్నర్‌ పుష్పిక డిసిల్వాను గాయపరిచారన్న ఆరోపణలపై కరోలిన్‌తో పాటు ఆమె సన్నిహితురాలిని అదుపులోకి తీసుకున్నారు. తనపై దాడి చేశారంటూ పుష్పిక ఇచ్చిన ఫిర్యాదుతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కిరీటం లాక్కొనేటప్పుడు పుష్పిక తలకు గాయం కాగా.. ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందాల్సి వచ్చింది.

సారీ చెబితే కేసు వెనక్కి తీసుకుంటా..
కొలంబోలోని సిన్నిమోన్‌ గార్డెన్స్‌ పోలీస్‌ స్టేసన్‌ వద్ద పుష్పిక మీడియాతో మాట్లాడుతూ.. కరోలిన్‌ బహిరంగంగా క్షమాపణ కోరితే తాను  కేసు వెనక్కి తీసుకుంటానన్నారు. కానీ అందుకు ఆమె సిద్ధంగా లేరని తెలిపారు. ‘ఈ అంశాన్ని కోర్టు బయట తేల్చుకొనేందుకే ప్రయత్నిస్తున్నా.. కానీ కరోలిన్‌ నిరాకరిస్తున్నారు.. ఈ ఘటనను నేను క్షమించగలను.. కానీ మరచిపోలేను’ అన్నారు. 

బెయిల్‌పై కరోలిన్‌ జూరీ విడుదల
ఈ ఘటనతో వేదిక వద్ద జరిగిన నష్టంతో పాటు పుష్పికను గాయపరిచినట్టు తమకు అందిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, బెయిల్‌పై వారిద్దరూ గురువారం విడుదలయ్యారని పేర్కొన్న పోలీసులు.. ఈ అంశంపై ఈ నెల 19న కోర్టులో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.

అసలేం జరిగింది?

శ్రీలంకలో ఆదివారం రోజున జరిగిన మిసెస్‌ శ్రీలంక పోటీల్లో పుష్పిక డిసిల్వాను న్యాయ నిర్ణేతలు విజేతగా ప్రకటించి కిరీటం పెట్టారు. ఇంతలోనే మిసెస్‌ వరల్డ్‌ కరోలిన్‌ జూరీతో పాటు ఆమె స్నేహితురాలు, మాజీ మోడల్‌ పద్మేంద్ర వేదికపైకి వెళ్లి పుష్పిక తలపై కిరీటాన్ని లాక్కున్నారు. పెళ్లి చేసుకున్నవారే పోటీకి అర్హులని, విడాకులు తీసుకున్న వారు కాదంటూ వాగ్వాదానికి దిగారు. భర్త నుంచి విడాకులు తీసుకున్నందున పుష్పిక అనర్హురాలంటూ కరోలిన్‌ వాదించింది. కిరీటాన్ని తీసుకొని రన్నరప్‌ తలకు పెట్టింది. దీంతో వేదికపై నుంచి దిగి వెళ్లిపోయిన పుష్పిక విలేకర్లతో మాట్లాడుతూ.. తాను భర్తకు దూరంగా ఉంటున్నానే తప్ప విడాకులు తీసుకోలేదని స్పష్టం చేసింది. దీంతో ఆమెకు కిరీటం ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలపడంతో పాటు క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని