కరోనా టీకా ఇచ్చారుగా.. అందుకే ఈ అభిమానం!

తాజా వార్తలు

Updated : 29/06/2021 16:29 IST

కరోనా టీకా ఇచ్చారుగా.. అందుకే ఈ అభిమానం!

వింబుల్డన్‌ వేదికగా ప్రొఫెసర్‌కి కృతజ్ఞతలు

లండన్‌: కరోనా మహమ్మారి కారణంగా వింబుల్డన్ తొలిరోజున అద్భుతం ఆవిష్కృతమైంది. నొవాక్‌ జకోవిచ్‌, రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, ఆండీ ముర్రే వంటి టెన్నిస్ దిగ్గజాల కోసం స్టేడియంలో కేరింతలు కొట్టే వీక్షకులు.. మరో దిగ్గజం కోసం లేచి నిలబడి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె మరెవరో కాదు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ సారా గిల్బర్ట్‌. అలాగే బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) సిబ్బందిపైనా తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కరోనా కారణంగా గతేడాది వింబుల్డన్ టోర్నమెంట్ వాయిదా పడింది. అయితే ఈ ఏడాది ఆ టోర్నీ జరగడానికి కృషి చేసిన నిర్వాహకులు, ప్రతినిధులను సెంటర్‌ కోర్టులోని ప్రతిష్ఠాత్మక  రాయల్‌ బాక్స్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు అనౌన్సర్‌ ప్రకటించారు. వారిలో కొవిడ్ టీకా అభివృద్ధిలో పాలుపంచుకున్న వ్యక్తి కూడా ఉన్నారని గర్వంగా చాటారు. అప్పటికే నిర్వాహకులకు చప్పట్ల రూపంలో కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించిన వీక్షకులు.. గిల్బర్ట్ పేరు చెప్పగానే మరింత బిగ్గరగా చప్పట్లు కొట్టారు. గ్యాలరీలో కూర్చున్న వారంతా గౌరవసూచకంగా నిలబడి సంతోషం వ్యక్తం చేశారు. మరోపక్క గిల్బర్ట్ ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ వీడియోను నిర్వాహకులు వింబుల్డన్ ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేయగా.. ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని