Vaccine:ఇప్పటి వరకు రాష్ట్రాలకు 26 కోట్ల డోసులు!  
close

తాజా వార్తలు

Published : 13/06/2021 19:02 IST

Vaccine:ఇప్పటి వరకు రాష్ట్రాలకు 26 కోట్ల డోసులు!  

దిల్లీ: ఇప్పటి వరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు 26 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు సరఫరాచేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. వీటిలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసిన డోసులతో పాటు రాష్ట్రాలు నేరుగా తయారీ సంస్థల నుంచి కోనుగోలు చేసినవి ఉన్నాయని తెలిపింది. రాష్ట్రాలకు అందిన మొత్తం 26,64,84,350 టీకా డోసుల్లో 25,12,66,637 డోసులు వినియోగించారని(వ్యర్థాలతో కలిపి) పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రాల వద్ద ఇప్పటికీ 1.53 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు మరో 4.5 లక్షల డోసులు సరఫరాలో ఉన్నాయి. రానున్న మూడు రోజుల్లో ఇవి ఇవి ఆయా రాష్ట్రాలకు చేరనున్నాయి.

మరోవైపు దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు లక్షకు దిగువనే నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 80,834 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 2 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. కొత్తగా 3,303 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,70,384కి చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 10,26,159కి చేరి.. ఆ రేటు 3.49 శాతానికి తగ్గింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని