Shashi Tharoor: సునందా పుష్కర్‌ కేసు.. శశిథరూర్‌కు ఊరట

తాజా వార్తలు

Updated : 18/08/2021 14:49 IST

Shashi Tharoor: సునందా పుష్కర్‌ కేసు.. శశిథరూర్‌కు ఊరట

దిల్లీ: తన భార్య సునందా పుష్కర్‌ మృతి కేసులో కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను దిల్లీలోని సెషన్స్‌ కోర్టు బుధవారం కొట్టివేసింది. 

దాదాపు ఏడేళ్ల క్రితం 2014, జనవరి 17న దిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో సునందా పుష్కర్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తొలుత ఇది హత్య అన్న కోణంలో విస్తృతంగా దర్యాప్తు జరిగింది. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అయితే, సునంద ఆత్మహత్య చేసుకునేలా థరూర్‌ ప్రవర్తించారని ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారు. దీనిపై ఆయన దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన సెషన్స్‌ కోర్టు.. నేడు థరూర్‌పైన నమోదైన అభియోగాలను కొట్టివేసింది. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన అదనపు పత్రాలను సమర్పించేందుకు దిల్లీ పోలీసులకు అనుమతినిచ్చింది. 

ఈ సందర్భంగా న్యాయస్థానానికి థరూర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘గత ఏడున్నరేళ్లుగా ఎన్నో వేధింపులకు ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు నాకు వాటి నుంచి ఉపశమనం లభించింది’’ అని ఆయన పేర్కొన్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని