close

తాజా వార్తలు

Published : 05/03/2021 23:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘తాండవ్’ వెబ్‌సిరీస్‌..అమెజాన్‌కు ఊరట

ఆ సంస్థ భారత్‌ హెడ్‌ను అరెస్టు చేయరాదని తీర్పు

దిల్లీ: అమెజాన్ ప్రైమ్ వీడియోకి చెందిన భారత్ హెడ్ అపర్ణా పురోహిత్‌కు శుక్రవారం సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. ‘తాండవ్’ వెబ్‌సిరీస్‌కు సంబంధించి ఆమెను అరెస్టు చేయరాదని తీర్పు వెలువరించింది. ఓటీటీ(ఓవర్‌-ది-టాప్‌)కు సంబంధించి ప్రభుత్వ నియమాలు కట్టుదిట్టంగా లేవని, అందుకే ప్రాసిక్యూషన్‌కు వీలులేకుండా పోయిందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 

‘సామాజిక మాధ్యమ వేదికలకు సంబంధించి సరైన నియంత్రణ వ్యవస్థ లేదు. చట్టం లేకుండా వాటిని నియంత్రించలేం’ అని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. తాండవ్ వెబ్‌సిరీస్‌పై నమోదైన కేసులకు సంబంధించి అపర్ణ పెట్టుకున్న బెయిల్‌ దరఖాస్తును గతంలో అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. దాన్ని సవాల్‌ చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఈ దరఖాస్తుపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం అరెస్టు నుంచి ఊరటకల్పిస్తూ..పై వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా కొన్ని ఓటీటీ వేదికలు అప్పుడప్పుడు అశ్లీల అంశాలను చూపిస్తున్నాయని గురువారం కోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ తరహా కార్యక్రమాలను నియంత్రించేందుకు ఓ యంత్రాంగం ఉండాలని స్పష్టం చేసింది.

సైఫ్‌ అలీఖాన్‌ నటించిన ‘తాండవ్‌’ మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్‌సిరీస్‌ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందంటూ.. అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో అమెజాన్‌ ప్రైమ్‌ స్పందించింది. ఇందులోని కొన్ని దృశ్యాల కారణంగా బాధపడిన వారికి బేషరతుగా క్షమాణలు చెబుతున్నామని ఆ సంస్థ తెలిపింది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని