సుప్రీంకోర్టు జడ్జీలకు రేపటి నుంచి టీకా

తాజా వార్తలు

Published : 01/03/2021 17:16 IST

సుప్రీంకోర్టు జడ్జీలకు రేపటి నుంచి టీకా

దిల్లీ: దేశంలో రెండో దశ కరోనా టీకా పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు కూడా నేడు వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మంగళవారం నుంచి టీకా ఇవ్వనున్నారు. ఇందుకోసం న్యాయస్థానం ప్రాంగణంలో ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కోర్టు రిజిస్ట్రీ వర్గాలు తెలిపాయి. న్యాయమూర్తులతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా టీకాలు వేయనున్నట్లు తెలిపింది. 

టీకా వేయించుకున్న ప్రముఖులు..

ప్రధాని మోదీ ఈ ఉదయం 6 గంటలకు ఎయిమ్స్‌లో తొలి డోసు తీసుకున్నారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులు కూడా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. బిహార్‌, ఒడిశా ముఖ్యమంత్రులు నితీశ్‌ కుమార్‌, నవీన్‌ పట్నాయక్‌, రాజస్థాన్‌ గవర్నర్‌ కల్రాజ్‌ మిశ్రా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేడు టీకా తీసుకున్నారు. 

రెండోదశలో భాగంగా 60ఏళ్లు పైబడిన వారికి, 45-59 ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి నేటి నుంచి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటులోనూ టీకాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేటులో టీకా ఒక్కో డోసు ధర రూ. 250గా కేంద్రం నిర్ణయించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని