
తాజా వార్తలు
నిజాం వారసత్వ కేసు.. త్వరగా తేల్చండి
హైకోర్టును ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూదిల్లీ: హైదరాబాద్ నవాబు వారసత్వానికి సంబంధించిన కేసును త్వరగా తేల్చాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం ప్రధాన న్యాయయూర్తి ఎస్.ఎ.బోబ్డే ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు 70 ఏళ్లుగా హైకోర్టులో పెండింగ్‌లో ఉందని సయ్యద్ జహీద్ అలీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దిగువ కోర్టుల్లో మూడు నిర్ణయాలు తనకు అనుకూలంగా వచ్చాయని కోర్టుకు విన్నవించారు. సయ్యద్‌ను సాలార్ జంగ్ వారసుడిగా ప్రకటించారని ఆయన తరఫు న్యాయవాది సుప్రీంకు తెలిపారు. ఆస్తి అప్పగించే విషయంలో ఒక కోర్టు తీర్పు స్పష్టంగా ఉందన్నారు. సయ్యద్‌ను వారసుడిగా తెలిపే అధికార పత్రం కూడా ఇచ్చారని న్యాయవాది వెల్లడించారు.
ఈ విషయంలో సయ్యద్ జాహిద్ అలీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పలు లేఖలు రాసినా.. ఒక్క దానికి కూడా సమాధానం రాలేదని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేసినప్పటి నుంచి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని వివరించారు. ఓ కేసు 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..
ఉద్యోగ సంఘాలతో చర్చలు ఆరంభించండి
‘కుటుంబం నుంచి ఒక్కరే.. చట్టం చేయండి’