దిల్లీ హైకోర్టు షోకాజ్ నోటీసులపై కేంద్రానికి ఊరట!

తాజా వార్తలు

Published : 05/05/2021 22:23 IST

దిల్లీ హైకోర్టు షోకాజ్ నోటీసులపై కేంద్రానికి ఊరట!

700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందించాల్సిందేనన్న సుప్రీం

దిల్లీ: దిల్లీలో ఆక్సిజన్‌ సరఫరా చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో పాటు తమ సూచన అమలుకాకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించి చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలపాలంటూ దిల్లీ హైకోర్టు జారీ చేసిన షోకాజ్‌ నోటీసులపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరిపిన సుప్రీం కోర్టు హైకోర్టు షోకాజ్ నోటీసులపై స్టే విధించింది. ఈ సందర్భంగా కేంద్రానికి కోర్టు ఊరట కలిగించే వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న సమయంలోనూ అధికారుల తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు ధిక్కరణ చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. 

అయితే, దిల్లీకి 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందించాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. దానికి సంబంధించిన ప్రణాళికను గురువారం ఉదయం 10:30 గంటల కల్లా కోర్టు ముందుంచాలని ఆదేశించింది. దిల్లీ అవసరాలకు 500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరిపోతుందని.. ఆ మేరకే అందించేందుకు అనుమతించాలన్న కేంద్రం అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందించాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని