పవార్‌జీ..తనకిష్టమైన పనిచేస్తున్నారు

తాజా వార్తలు

Published : 31/03/2021 22:29 IST

పవార్‌జీ..తనకిష్టమైన పనిచేస్తున్నారు

ముంబయి: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు గాల్‌బ్లాడర్(పిత్తాశయం) శస్త్రచికిత్స విజయవంతమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, తనకిష్టమైన పని చేస్తున్నారంటూ పవార్ కుమార్తె సుప్రియా సూలే సామాజిక మాధ్యమాల్లో ఓ చిత్రాన్ని షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు, సిబ్బందికి  కృతజ్ఞతలు తెలియజేశారు. 

‘పవార్ సాహెబ్ తనకు అత్యంత ఇష్టమైన పని చేస్తున్నారు’ అంటూ ఈ రోజు ఉదయం శరద్ పవార్ వార్తా పత్రిక చదువుతున్నప్పటి చిత్రాన్ని సుప్రియా ఇన్‌స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు. ఆదివారం పొత్తికడుపులో నొప్పి కారణంగా పవార్ బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు..గాల్‌ బ్లాడర్‌లో ఉన్న రాయిని తొలగించారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని