‘కంగనకు నా మద్దతు’ పేరుతో చీరలు 

తాజా వార్తలు

Published : 15/09/2020 21:35 IST

‘కంగనకు నా మద్దతు’ పేరుతో చీరలు 

రూపొందించిన సూరత్ వస్త్ర వ్యాపారవేత్తలు

సూరత్‌ : బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌కు మద్దతు తెలుపుతూ ఆమె చిత్రాలతో ఉన్న చీరలను సూరత్‌కు చెందిన వస్త్ర వ్యాపారులు చౌటు భాయ్‌, రజత్‌ దేవర్‌లు విడుదల చేశారు. కొద్దికాలంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగనకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వీళ్లు కంగనకు ఇలా చీరలపై ఆమె ఫొటోలు వేసి మద్దతు తెలపటం చర్చనీయాంశమైంది. యూనివర్సల్‌ టెక్స్‌టైల్‌ మార్కెట్‌కు చెందిన అలియా ఫ్రాబ్రిక్స్‌కు యాజమానులైన వీరు ప్రింటెంట్‌ చీరపై కంగన నటించిన మణికర్ణిక చిత్రంలోని ఫొటోలను ప్రచురించారు. వాటికి జతగా ‘నా మద్దతు కంగనకు’ అనే నినాదాలను జోడించారు.

ఈ విషయంపై ఇద్దరు వ్యాపారవేత్తలు మాట్లాడుతూ ఒంటరిగా పోరాటం చేస్తున్న మహిళపై మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించటం దారుణమన్నారు. కంగన లేని సమయంలో ఆమె ఆస్తులను ధ్వంసం చేయటం అన్యాయమని వివరించారు. ముంబయిలో తను అడుగు పెట్టడానికే భయపడేలా ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. అక్కడి పాలకులకు కంగన జవాబు ఇచ్చిన తీరు తమను ప్రభావితం చేసిందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కంగనకు తాము సంఘీభావం తెలిపేందుకు సిద్ధమై, ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రస్తుత కరోనా విలయం వెంటాడుతున్న సమయంలోనూ కంగన ఫొటోలు ఉన్న డిజైనర్‌ చీరలకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడిందన్నారు. వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఈ చీరలు కావాలని భారీగా ఆర్డర్లు వస్తున్నట్లు వారు తెలిపారు. దీని ద్వారా పెద్ద సంఖ్యలో మహిళలు కంగనకు మద్దతు తెలిపినట్లు అని వివరించారు. ముంబయి, దిల్లీ, కోల్‌కతా, హైదరాబాదు, చెన్నైలలో చౌటుభాయ్‌, రజత్‌ దేవర్‌లు వ్యాపారాన్ని విస్తరించారు. చైనా వస్తువులను నిషేధించాలని ఇటీవల జరిగిన ఉద్యమంలోనూ ఈ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని