close

తాజా వార్తలు

Updated : 05/03/2021 21:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డాలర్‌ స్మగ్లింగ్‌ కేసులో విజయన్‌ పాత్ర: కస్టమ్స్‌

కోచి: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో అధికార ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి గట్టి షాక్‌ తగిలింది. యూఏఈ కాన్సులేట్‌ అధికారుల సూత్రధారులుగా ఉన్న డాలర్‌ స్మగ్లింగ్‌ కేసులో సీఎం విజయన్‌ పాత్ర కూడా ఉందని కస్టమ్స్‌ అధికారులు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆయనతోపాటు స్పీకర్‌ పి. శ్రీరామకృష్ణన్‌, పలువురు మంత్రుల పాత్ర కూడా ఇమిడి ఉందని పేర్కొన్నారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్నా సురేశ్‌ తమ విచారణలో ఈ వివరాలు వెల్లడించారంటూ కస్టమ్స్‌ అధికారులు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు విచారణ సమయంలో ఈ డాలర్‌ స్మగ్లింగ్‌ కేసు వెలుగుచూసింది. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్‌కు చెందిన ఫైనాన్స్‌ హెడ్‌ 1,90,000 అమెరికన్‌ డాలర్ల (₹1.30 కోట్లు)ను ఒమన్‌లోని మస్కట్‌కు తరలిస్తుండగా పట్టుబడ్డారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సురేశ్‌, సరితను అరెస్ట్‌ చేసిన కస్టమ్స్‌ అధికారులు.. వారిని విచారించగా డాలర్‌ స్మగ్లింగ్‌ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించినట్లు కస్టమ్స్‌ అధికారులు పేర్కొన్నారు. విదేశీ నగదు అక్రమ రవాణా వ్యవహారంలో యూఏఈ మాజీ కాన్సుల్‌ జనరల్‌తో సీఎం విజయన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్వప్నా సురేశ్‌ వెల్లడించినట్లు కస్టమ్స్‌ అధికారులు పేర్కొన్నారు. సీఎంతో పాటు ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఆయన వ్యక్తిగత సిబ్బంది పాత్ర కూడా ఉందని తెలిపారు. ఆర్థిక లావాదేవీలు సీఎం ఎదుటే జరిగాయని స్వప్నా సురేశ్‌ పేర్కొన్నట్లు తెలిపారు. కస్టమ్స్‌ అధికారులు అఫిడవిట్‌ నేపథ్యంలో సీఎంపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. విజయన్‌కు ఎంతమాత్రం పదవిలో కొనసాగే అర్హత లేదని, వెంటనే వైదొలగాలని డిమాండ్‌ చేసింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని