Justin Trudeau: తాలిబన్లు ఉగ్రవాదులు.. ఆంక్షలు విధించండి

తాజా వార్తలు

Published : 25/08/2021 01:43 IST

Justin Trudeau: తాలిబన్లు ఉగ్రవాదులు.. ఆంక్షలు విధించండి

 కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో

ఇంటర్నెట్‌డెస్క్‌: తాలిబన్లు ఉగ్రవాదులని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తేల్చి చెప్పారు. వారిని తాము అలానే గుర్తిస్తామన్నారు. తాలిబన్లపై ఆర్థిక ఆంక్షలకు తాను అనుకూలమని ట్రూడో పేర్కొన్నారు. త్వరలోనే జీ-7 వర్చువల్‌ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. తాలిబన్ల విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించేందుకు ఈ జీ7 సమావేశం జరగనుంది. ‘‘త్వరలో జీ7 భేటీ జరగనుంది. దానిలో అఫ్గానిస్థాన్‌కు తాము మరింత మెరుగ్గా ఏమి చేయగలమో చర్చించి.. వాటిని అమలు చేస్తాం’’ అని ట్రూడో  పేర్కొన్నట్లు ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ పేర్కొంది.

అఫ్గాన్‌లో విధించిన తుది గడువు పొడిగించమని ఈ జీ7 భేటీలో కోరే అవకాశం ఉంది.  అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌లు ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. వీలైనంత ఎక్కువ మందిని అఫ్గానిస్థాన్‌ దాటించేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నారని స్కైన్యూస్‌ పేర్కొంది.

ఇప్పటికే బలగాలు, ఉద్యోగులు, శరణార్థుల తరలింపు కార్యక్రమం తీవ్ర గందరగోళంగా మారింది. ఇప్పటికే దేశం వీడేందుకు భారీ సంఖ్యలో ప్రజలు కాబుల్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటున్నారు. దీంతో నిత్యం అక్కడి నుంచి ఏదో ఒక దుర్వార్త వస్తూనే ఉంది. సంకీర్ణ సేనలు ఇప్పటి వరకు 28 వేల మందిని అఫ్గానిస్థాన్‌ నుంచి కాపాడినట్లు సమాచారం.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఈ తరలింపు కార్యక్రమం పొడిగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చు. దీనికోసం బైడెన్‌ కొందరు నేతలతో చర్చించారు. ఇప్పటికే అక్కడ ఆరు వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని