Afghan: అరాచకం! కూడళ్ల వద్ద మృతదేహాలను వేలాడదీస్తున్న తాలిబన్లు

తాజా వార్తలు

Published : 26/09/2021 01:47 IST

Afghan: అరాచకం! కూడళ్ల వద్ద మృతదేహాలను వేలాడదీస్తున్న తాలిబన్లు

హెరాత్‌: అఫ్గాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తాలిబన్లు గత పాలనను గుర్తుకు తెస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా రద్దీగా ఉండే కూడళ్ల వద్ద మృతదేహాలను వేలాడదీస్తున్నారు. హెరాత్‌ పట్టణంలోని ఓ ప్రధాన కూడలి వద్ద క్రేన్‌ సాయంతో శనివారం ఓ వ్యక్తి శవాన్ని వేలాడదీసినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియా వర్గాలకు తెలిపారు. అయితే తండ్రీకుమారులను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన నలుగురు దుండగులను మట్టుబెట్టి ఇలా చేసినట్లు తాలిబన్లు పేర్కొంటున్నారు. వారిలో ఓ మృతదేహాన్ని హెరాత్‌ కూడలిలో వేలాడదీశామని, మిగతా మూడు శవాలను కూడా వేలాడదీసేందుకు ఇతర పట్టణాలకు తరలించినట్లు తెలిపారు.

తాలిబన్‌ ప్రభుత్వం నియమించిన హెరాత్‌ జిల్లా పోలీసు చీఫ్‌ జియావుల్‌హక్‌ జలాని మాట్లాడుతూ.. నలుగురు కిడ్నాపర్ల నుంచి తండ్రి, కుమారుడిని రక్షించి దుండగులను హతమార్చినట్లు వెల్లడించారు. కిడ్నాపర్లు జరిపిన కాల్పుల్లో ఓ తాలిబన్ ఫైటర్‌తోపాటు ఓ పౌరుడు గాయపడినట్లు తెలిపారు. ఎదురు కాల్పుల్లో ఆ నలుగురిని హతమార్చామని వెల్లడించారు. అయితే ఇందులో వాస్తవాలు తెలియాల్సి ఉంది. అఫ్గానిస్థాన్‌లో 1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని తాలిబన్లు ఈమధ్యే వెల్లడించారు. తాలిబన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్‌ తురాబీ మాట్లాడుతూ.. గతంలో తాము బహిరంగంగా శిక్షలను అమలు చేసినప్పుడు చాలా దేశాలు విమర్శించాయని, కానీ తామెప్పుడూ ఆయా దేశాల చట్టాలు, శిక్షల గురించి మాట్లాడలేదన్నారు. మా చట్టాలు ఎలా ఉండాలో ఇతరులు చెప్పనక్కర్లేదని, మా అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని