Lockdown: తమిళనాడులో లాక్‌డౌన్‌ పొడిగింపు
close

తాజా వార్తలు

Updated : 05/06/2021 22:22 IST

Lockdown: తమిళనాడులో లాక్‌డౌన్‌ పొడిగింపు

చెన్నై: కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ లాక్‌డౌన్‌ను జూన్‌ 14 వరకు పొడిగిస్తున్నట్లు శనివారం ప్రకటించారు. దేశంలోనే అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదవుతున్న ఐదు రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటిగా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 22,651 కేసులు నమోదై దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో తమిళనాడు నుంచే 18.79 శాతం ఉన్నాయి.

అయితే కొవిడ్‌ కేసులు తక్కువగా ఉన్న పలు జిల్లాలకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. నిత్యావసర దుకాణాలు, కూరగాయల షాపులతోపాటు మాంసం, చేపల దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడుపుకోవచ్చని తెలిపింది. వీటితోపాటు ఎలక్ట్రానిక్‌ దుకాణాలు, వాహనాల విడిభాగాలు విక్రయించే దుకాణాలకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం మంది ఉద్యోగులు ఉండవచ్చని పేర్కొంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు 50 టోకెన్లు ఇవ్వచ్చని తెలిపింది. వీటితోపాటు పలు మినహాయింపులు ఇచ్చింది.

పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో మే 24 నుంచి తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. ఇది జూన్‌ 7 వరకు అమల్లో ఉండనున్నట్లు పేర్కొంది. అయితే కొవిడ్‌ వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ..  పదేపదే లాక్‌డౌన్‌ను పొడిగించలేమని, త్వరలోనే దీనికి ముగింపు పలకాలని యోచిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈనెల 1వ తేదీన వెల్లడించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే అంశం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. అయితే కొవిడ్‌ కేసుల్లో తగ్గుదల కనిపించకపోవడంతో ప్రభుత్వం తాజాగా మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని