Oxygen: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

తాజా వార్తలు

Updated : 26/04/2021 16:19 IST

Oxygen: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

తూత్తుకుడి స్టెరిలైట్‌ ప్లాంట్ తెరవాలని నిర్ణయం

చెన్నై: ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తూత్తుకుడిలో (thoothukudi) వేదాంతకు చెందిన స్టెరిలైట్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. కాలుష్యం వెదజల్లుతోందన్న కారణంతో 2018లో దీన్ని మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆక్సిజన్​ ఉత్పత్తి కోసం మాత్రమే sterilite ప్లాంట్‌ను తెరవాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కమిటీ దీని పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనుంది. ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్లాంటులో ఆక్సిజన్‌ ఉత్పత్తి మాత్రమే జరగాలని.. ఇతర కార్యకలాపాలేవీ ప్రారంభించొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత సమస్యపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. స్టెరిలైట్ ప్లాంటును తెరవడంలో ఉన్న ఇబ్బందేంటని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజలు ఆక్సిజన్‌ కొరతతో చనిపోతున్న తరుణంలో ప్లాంటును ప్రభుత్వం చేతిలోకి తీసుకొని ప్రాణవాయువును ఉత్పత్తి చేయొచ్చు కదా అని నిలదీసింది. అంతకుముందు తాము ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసి కొవిడ్‌ రోగులకు ఉచితంగా అందిస్తామని వేదాంత (vedanta) ముందుకు వచ్చింది. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వమే తమ ప్లాంటు ద్వారా ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పరిణామాల అనంతరం తాజాగా ప్లాంటును ప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని