ఒంటె పై ప్రయాణించి.. పాఠాలు బోధించి..

తాజా వార్తలు

Updated : 10/07/2021 20:20 IST

ఒంటె పై ప్రయాణించి.. పాఠాలు బోధించి..

రాజస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయం 

జైపుర్‌: ఏదైనా తలుచుకుంటే అసాధ్యమైనా సరే.. సుసాధ్యం చేస్తామని నిరూపిస్తున్నారు రాజస్థాన్‌ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. కరోనా కారణంగా పాఠశాలలన్నీ మూతపడటంతో ఆన్‌లైన్‌ విద్యనే విద్యార్థులకు మార్గమైంది. అయితే కొందరు విద్యార్థులకు సాంకేతిక లోపాలు, డిజిటల్‌ వసతుల కొరత, ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పినా అర్థం కాకపోవడం..తదితర సమస్యలు తలెత్తాయి. చుట్టూ ప్రతికూల పరిస్థితులున్నా  విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా చెప్పాలని సంకల్పించారు రాజస్థాన్‌లోని బార్‌మేడ్‌ జిల్లాకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు. విన్నూతంగా ఆలోచించి కష్టమైనా సరే విద్యార్థుల ఇళ్లకు ఒంటెలపై వెళ్లి పాఠాలు బోధించాలని నిర్ణయానికి వచ్చారు. ఇంటర్నెట్‌ సదుపాయం లేని విద్యార్థులకు మాత్రమే ఈ విధంగా పాఠాలు చెప్పడం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో రాజస్థాన్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ సౌరవ్‌ స్వామి మాట్లాడుతూ.. ‘‘ మొత్తం 75 లక్షల మంది విద్యార్థుల్లో చాలా మందికి మొబైల్‌ సదుపాయం లేదు. అందుకే వారానికోసారి 1-8 తరగతులు, వారానికి రెండుసార్లు 9-12 తరగతుల విద్యార్థుల ఇంటికి వెళ్లి పాఠాలు బోధించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. కాస్త కష్టమైనా మా ఈ ఆలోచనకు ఉపాధ్యాయులందరూ సహకరిస్తున్నారు’’ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని