Tehelka: లైంగిక వేధింపుల కేసులో తేజ్‌పాల్‌కు విముక్తి

తాజా వార్తలు

Published : 21/05/2021 12:51 IST

Tehelka: లైంగిక వేధింపుల కేసులో తేజ్‌పాల్‌కు విముక్తి

పణజీ: అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో తెహ‌ల్కా వ్యవస్థాపక సంపాదకుడు త‌రుణ్ తేజ్‌పాల్‌ను గోవా కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ నెల 19నే ఈ కేసుపై తీర్పు వెలువడాల్సి ఉండగా.. అయితే రెండు, మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో తీర్పును వాయిదా వేశారు.

2013లో జ‌రిగిన‌ ఓ స‌మావేశంలో త‌రుణ్ తేజ్‌పాల్ త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డారంటూ తెహల్కాకు చెందిన ఓ మ‌హిళా ఉద్యోగి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేర‌కు త‌రుణ్ తేజ్‌పాల్‌పై కేసు న‌మోదు చేసిన గోవా పోలీసులు 2013 న‌వంబ‌ర్ 30న ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. గోవా కోర్టు ఈ కేసు విచార‌ణ చేప‌ట్టింది. అయితే, త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఆ ఆరోప‌ణ‌ల‌ను కొట్టివేయాల‌ని తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అదేవిధంగా బెయిల్ పిటిష‌న్ కూడా దాఖ‌లు చేశారు.

2014లో సుప్రీంకోర్టు తేజ్‌పాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లపై విచారణ కొనసాగించాలని గోవా కోర్టును ఆదేశించింది. దీనిపై వాదనలు విన్న కోర్టు నేడు తుదితీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుపై తేజ్‌పాల్‌ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడున్నరేళ్లలో తన కుటుంబం తీవ్ర క్షోభకు గురైందని ఆయన కుమార్తె కారా తేజ్‌పాల్‌ అన్నారు. ‘అన్ని ఆధారాలను క్షుణ్నంగా పరిశీలించి కోర్టు నిష్పాక్షిక విచారణ జరిపింది’ అని ఆమె అభిప్రాయపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని